AP: వైసీపీని వీడుతున్న వారిలో ఎమ్మెల్సీలే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి హ్యాండ్ ఇచ్చారు. తాజాగా జగన్ సన్నిహితుడు, పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు మరో ఎమ్మెల్సీ పార్టీని వీడేందుకు రెడీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. తూ.గో. జిల్లా రామచంద్రాపురానికి చెందిన తోట త్రిమూర్తులు కూడా వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారట.