ట్రాక్టర్ కింద పడి 18 నెలల బాలుడు మృతి

84చూసినవారు
ట్రాక్టర్ కింద పడి 18 నెలల బాలుడు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లెందు మండలం బోయి తండాలో విషాదం చోటుచేసుకుంది. వాంకుడోత్ శ్రీకాంత్-కళ్యాణి దంపతుల 18 నెలల కుమారుడు ఆర్యన్ ట్రాక్టర్ కిందపడి మృతిచెందాడు. వీరి బంధువు వినోద్ ట్రాక్టర్ ఇంట్లో పెట్టే సమయంలో, ఆటలో మునిగిపోయిన ఆర్యన్ ట్రాక్టర్ వెనుకకు వచ్చాడు. గమనించకుండా ట్రాక్టర్ వెనుకకు తీసుకురావడంతో బాలుడి తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రికి తరలించినా, చిన్నారి ప్రాణాలు దక్కలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్