ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 3 నుండి 6 వరకు థాయిలాండ్, శ్రీలంక పర్యటించనున్నారు. ఏప్రిల్ 4న థాయిలాండ్‌లో జరిగే 6వ BIMSTEC సమ్మిట్‌లో పాల్గొంటారు. అనంతరం ఏప్రిల్ 4-6 వరకు శ్రీలంక అధికారిక పర్యటనలో భాగంగా అక్కడ పర్యటించనున్నారు. అయితే, 2018 తర్వాత BIMSTEC నాయకుల తొలి ప్రత్యక్ష సమావేశమిది. ఇందులో వాణిజ్యం, భద్రత, కనెక్టివిటీ, సామర్థ్య అభివృద్ధి వంటి అంశాలపై చర్చ జరుగనుంది.