జగిత్యాల: మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరనీయమని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డా. సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు మాజీ ప్రధామంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు కౌన్సిలర్లు బాలే లత శంకర్, శ్రీలత రామ్మోహన్ రావు పాల్గొన్నారు.