టీచర్-అంగన్‌వాడీ వర్కర్ ఫైటింగ్.. వీడియో వైరల్

72చూసినవారు
ఉత్తరప్రదేశ్ మధురలో ఓ ప్రాథమిక పాఠశాలలో షాకింగ్ ఘటన జరిగింది. అంగన్‌వాడీ కార్యకర్త చంద్రవతి, అసిస్టెంట్ టీచర్ ప్రీతి తివారీ మధ్య వాగ్వాదం తీవ్రంగా మారి కొట్లాటకు దారితీసింది. ఈ గొడవలో చిన్నారులు కూడా పాలుపంచుకోవడం విశేషం. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో విద్యాశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. టీచర్ ప్రీతిపై అనేక ఫిర్యాదులు ఉన్నట్టు గుర్తించారు. గొడవలో గాయపడిన చంద్రవతి ఐసీయూలో చికిత్స పొందుతోంది.

సంబంధిత పోస్ట్