అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసన

55చూసినవారు
అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసన
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ లో సోమవారం ఐసీడీఎస్ పొలాస సెక్టార్ 2వ సెంటర్ ఆధ్వర్యంలో పోషక ఆహార మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన చేశారు. అనంతరం పిల్లలకు చిత్రాలను చూపించడం, కథలు చెప్పించడం బొమ్మలు వేయించడంపై అవగాహన కల్పించారు. తల్లులకు పిల్లల పెరుగుదల, బాలమృతం, పోషకాహారంపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్