వెంకట్రావు పల్లిలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బూడిద సమ్మయ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంలో మహనీయులను గుర్తు చేసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్ నిఖిలా రాణి, ఏఎన్ఎం తిరుమల, నాయకులు బోగే వెంకటేష్, బూడిద ఓదెలు తదితరులు పాల్గొన్నారు.