జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో ముందస్తు హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థి విద్యార్థులు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మోటూరి ప్రవీణ్ కుమార్ గారు పండుగ ప్రాముఖ్యతను ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు MP మోటూరి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు మంచి కట్ల నాగరాజు, వెల్మల రాజేశ్వర్ రెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు, అంగన్వాడి ఉపాధ్యాయురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.