కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల వ్యాప్తంగా రూ. 6, 307, 308 విలువ గల 63 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సోమవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కాటిపల్లి సరోజన, ఆది రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తోట శ్రీనివాస్, దేవా మల్లన్న, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.