కర్ణాటకలో గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వల్ల మోసపూరిత పాలన జరుగుతుందని కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులు, మానకొండూర్ అసెంబ్లీ ప్రవాసి ప్రభారీ ఆర్ మారుతి ఆరోపించారు. జాతీయ పార్టీ సూచనల మేరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధి పర్యటన సందర్బంగా బుధవారం మండలంలోని రేణికుంట, గొల్లపల్లి, కొత్తపల్లి గ్రామాల్లోని కార్యకర్తలను కలిసి ఓటర్లను మాట్లాడి బీజేపీకే ఓటయ్యాలని అభ్యర్థించారు.