పెద్దపల్లి జిల్లాలో ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణకు పత్తిపాక రిజర్వాయర్ దోహదపడుతుందని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. ఎస్సారెస్పీ ఉన్నతాధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా రైతుల చిరకాల స్వప్నమైన పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. సీఈ సుధాకర్ రెడ్డి, ఈఈ సంతు ప్రకాష్ రావు, జెఈ హరీష్, మోతె ప్రాజెక్టు మేనేజర్ కిరణ్ కుమార్ ఉన్నారు.