గేదెలను కొల్పోయిన రైతులకు అండగా శశిభూషణ్ కాచే

2389చూసినవారు
గేదెలను కొల్పోయిన రైతులకు అండగా శశిభూషణ్ కాచే
పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి గ్రామ శివారులో గడ్డి మేస్తూ విద్యుత్ ఘాతంతో పది గేదెలు మృతి చెందాయి. ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తెగి పడడంతో మూగజీవాలు చనిపోయాయి. ఈ గేదెలన్నీ నాగెపల్లి రైతులకు చెందినవిగా గుర్తించారు. ఇట్టి విషయం పై స్పందించిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు శశిభూషణ్ కాచే ప్రతి గేదెకు రూ 40, 000/- నష్ట పరిహారంగా ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని మంథని విద్యుత్ అధికారులకు సూచించారు. తమకు అండగా నిలిచినందుకు పాడిరైతులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్