ప్రభుత్వ పాఠశాలలో బాలికా సంరక్షణ కార్యక్రమం

582చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో బాలికా సంరక్షణ కార్యక్రమం
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నంది మేడారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అత్తె రాజారాం ఆధ్వర్యంలో పేరెంట్ టీచర్ సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎఫ్ ఎల్ ఎన్ లో భాగంగా పిల్లల పుస్తక పఠన కార్యక్రమం, పిల్లల విద్యా ప్రగతి ప్రదర్శించడం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈనెల సమావేశం ముఖ్య ఎజెండా బాలిక సంరక్షణ, లింగ బేధం, సమానత్వం అనే అంశాలను వివరించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్