కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిభా పూలే జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డితోపాటు నాయకులు హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆడెపు రాజు, పాల రాజేశం, మాదాసి సతీష్, పులి ఇంద్రకరణ్ రెడ్డి, శివరామకృష్ణ, మునీర్, సబ్బని రాజమల్లు, గుడ్ల సంపత్, పింగిలి మల్లారెడ్డి, గరిగంటి ఐలయ్య పాల్గొన్నారు.