పెద్దపల్లికి బస్ డిపోను మంజూరు చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. శుక్రవారం కాల్వ శ్రీరాంపూర్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ రమణారావు విజ్ఞప్తి మేరకు మంత్రి పొన్నం బస్ డిపో పై ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మంత్రులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లకు ఎమ్మెల్యే విజయరమణారావు కృతజ్ఞతలు తెలిపారు.