రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేశాం: భట్టి

84చూసినవారు
రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేశాం: భట్టి
ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షలలోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేశామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సభలో ఆయన మాట్లాడుతూ పీపుల్స్‌ ప్రజా యాత్ర సమయంలో రామగుండంలో 6 రోజుల పాటు పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. 6 రోజుల పాదయాత్రలో సింగరేణి ప్రజల ఆవేదనను విన్నానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవెర్చే దిశగా పాలన సాగిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్