ధర్మారం: మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు: జిల్లా కలెక్టర్
కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరపై పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం ధర్మారం మండలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి అందుబాటులో ఉన్న వసతులు పరిశీలించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులు, గోదాములకు తరలించాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీమాల పాల్గొన్నారు.