కట్టలింగంపేటలో ప్రమాదకరంగా మారిన వృక్షం..

76చూసినవారు
కట్టలింగంపేటలో ప్రమాదకరంగా మారిన వృక్షం..
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కట్టలింగంపేటలో ఓ వృక్షం ప్రమాదకరంగా మారింది. గ్రామంలోని కోరుట్ల- వేములవాడ ప్రధాన రహదారిలో ప్రక్కన గల ఒర్రెలో గురునాథం చెరువు నుంచి వచ్చే వరద నీటితో ఓ భారీ వృక్షం వేళ్ళు పైకి తేలాయి. వృక్షం రోడ్డు వైపు వంగి ఉంది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదం జరగకముందే తొలగించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్