వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ తల్లి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావడం మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో కుటుంబ సమేతంగా బోనాల నైవేద్యాలు సమర్పించేందుకు బారులు తీరారు. అందర్నీ చల్లంగా చూడు తల్లి అంటూ అమ్మవారిని భక్తజనం వేడుకున్నారు. సోమవారం రాజన్న దర్శించుకున్న భక్తులు మంగళవారం అమ్మవారి సేవలో తరించడం ఆనవాయితీ వస్తోంది