చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్ సూచించారు. పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి వసతులను పరిశీలించారు. చిన్నారులకు పోషకాహారం అందించాలని ఆదేశించారు.