చొప్పదండి
వర్షంలోనూ బతుకమ్మ వేడుకలు
చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామంలో వర్షంలోనూ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వల్పంగా వర్షం కురవడంతో మహిళలు కాస్త ఇబ్బందులు పడ్డారు. చిన్నారులు, ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి నృత్యాలు చేశారు. ముందుగా సద్దుల బతుకమ్మ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక నైవేద్యాలు నివేదించారు. అనంతరం స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.