సీఎంకు హైకోర్టులో చుక్కెదురు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టులో మంగళవారం చుక్కెదురైంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో సీఎంపై విచారణకు ఇటీవల గవర్నర్ ఆదేశించారు. దీనిని వ్యతిరేకిస్తూ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. అయితే సీఎం పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. గవర్నర్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది.