AAP ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేసిన స్పీకర్

57చూసినవారు
AAP ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేసిన స్పీకర్
ఢిల్లీలో మాజీ మంత్రి, AAP ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆనంద్‌పై అనర్హత వేటు పడింది. దళితులకు AAPలో సరైన ప్రాతినిథ్యం దక్కడం లేదని ఆయన గతంలో ఆరోపించారు. ఏప్రిల్‌లో తన మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా సమర్పించారు. తర్వాత BSPలో చేరి, ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. మరో వైపు ఆయనను పలుమార్లు స్పీకర్ విచారణకు పిలిచినా రాజ్‌కుమార్ హాజరు కాలేదు. దీంతో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేశారు.

సంబంధిత పోస్ట్