హనుమకొండలో దీక్ష చేస్తున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడడుతూ.. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని కూడా అబద్ధాల వేదికగా మార్చారని విమర్శించారు. రైతులకు మేం రుణమాఫీ చేస్తే.. చేయలేదంటున్నారని మండిపడ్డారు.