సాధారణంగా పెట్రోల్ బంకుల్లో ఫోన్‌ల మాట్లాడడం, అగ్గిపుల్లలు వెలిగించడం నిషేధం. అయితే పెట్రోల్ బంకు సిబ్బంది ఏకంగా.. బంకులోనే చలి మంట వేసుకున్నారు. పెట్రోల్ పట్టే మిషిన్లకు సమీపంలోనే మంటలు వేసి మరీ, దాని చుట్టూ కూర్చున్నారు. చిన్న మంట కనిపించినా కంగారు పడే పెట్రోల్ బంకు సిబ్బంది.. అందుకు విరుద్ధంగా ఏకంగా చలి మంట వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. నెట్టింట వైరలవుతోంది.