మాయ మాట‌లతో యువ‌తిని పెళ్లాడిన వ్య‌క్తి.. అప్పటికే ఇద్దరు పిల్లలు

77చూసినవారు
మాయ మాట‌లతో యువ‌తిని పెళ్లాడిన వ్య‌క్తి.. అప్పటికే ఇద్దరు పిల్లలు
AP: కృష్ణా జిల్లాలో మోస‌పూరిత ఘ‌ట‌న జరిగింది. రైల్వే ఎస్ఐని అంటూ మాయ మాటలు చెప్పి కొల్లూరుకు చెందిన ఓ యువ‌తిని మేడేప‌ల్లి వెంక‌టేశ్వ‌ర‌రావు అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. అతడికి అప్ప‌టికే పెళ్లై భార్య,ఇద్దరు పిల్ల‌లు ఉన్నారు. ఆ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌కుండా యువ‌తిని మోసం చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తాన‌ని న‌మ్మించి బాధిత యువ‌తి అక్క వ‌ద్ద రూ.4లక్షలకు పైగా కాజేశాడు. యువ‌తి కుటుంబ స‌భ్యుల‌కు అనుమానం వ‌చ్చి ఆరా తీయడంతో అతడి మోసం బయటపడింది. దీంతో యువతి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్