సౌరాష్ట్ర స్టార్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ల నుంచి తప్పుకున్నారు. షెల్డన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఇవాళ (జనవరి 3) ప్రకటించారు. సౌరాష్ట్ర వికెట్ కీపర్ బ్యాటర్ అయిన జాక్సన్ మూడు ఫార్మాట్లలో (ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ,టీ20) కలిపి 11,791 పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు ఉన్నాయి. 38 ఏళ్ల జాక్సన్ ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో తన చివరి మ్యాచ్ ఆడాడు.