అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్.. ఇప్పట్లో తిరిగి వచ్చేల పరిస్థితులు కనిపించట్లేదు. సునీతా విలియమ్స్, బ్యారీ విల్మోర్ ఇద్దరు వ్యోమగాములను తీసుకొని అంతరిక్షంలోకి వెళ్లిన బోయింగ్ సంస్థ వ్యోమనౌకకు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి ఖాళీ క్యాప్సుల్ కిందకు వచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి బోయింగ్ స్టార్లైనర్ భూమిని చేరింది.