తెలంగాణ పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని KTR ట్వీట్ చేశారు. 'అలె లక్ష్మణ్ తయారుచేసిన రాష్ట్ర రాజముద్రలో రాష్ట్ర చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా-జమునా తహజీబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడనట. రాష్ట్ర గీతంలో “గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్“అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి!? సీఎంకు, మంత్రి మండలికి రాష్ట్రగీతంలో ఏమున్నదో తెలుసా?' అని ఎద్దేవా చేశారు.