సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండుగ హోదా

61చూసినవారు
సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండుగ హోదా
సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండుగ హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జీవో జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సహా (హైదరాబాద్ మినహా) అన్ని జిల్లా కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కోరిక మేరకు ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్