ఇంట్లోనే ఉండండి .. బయటకు రావద్దు: నగర వాసులకు GHMC విజ్ఞపి

69చూసినవారు
ఇంట్లోనే ఉండండి .. బయటకు రావద్దు: నగర వాసులకు GHMC విజ్ఞపి
నగరం అంతటా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నందున పౌరులందరూ ఇంట్లోనే ఉండి, అనవసర ప్రయాణాలను మానుకుని భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అని GHMC హైదరాబాద్ నగర వాసులకు కీలక విజ్ఞపి చేసింది. "చెట్లు, విద్యుత్ స్తంభాలు, నీటి వనరుల నుండి దూరంగా ఉండండి. పిడుగుపాటు సమయంలో మెటల్ వస్తువులు, విద్యుత్ పరికరాలను ఉపయోగించవద్దు. నిర్మాణ స్థలాల నుండి దూరంగా ఉండండి, వరద నీటిలో సంచరించద్దు. అత్యవసర పరిస్థితులలో సిటీ హెల్ప్‌లైన్ 040 21111111ని సంప్రదించండి." అని GHMC ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

సంబంధిత పోస్ట్