పాఠశాలలు, కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులు కొన్నేళ్ల తర్వాత గెట్ టూ గెదర్ పెడుతుంటారు. అప్పుడు తమ పాత మధుర అనుభూతులను గుర్తుతెచ్చుకుంటూ ఉంటారు. కొందరు సరదా సరదా పనులు చేస్తుంటారు. అలాంటి ఓ ఫన్నీ వీడియోనే ఇది. తమిళనాడులోని ఓ పాఠశాలలో పూర్వ విద్యార్థులు మళ్లీ కలుసుకున్నారు. అలనాడు తమ ఉపాధ్యాయులు కొట్టిన తీరుగానే ఇప్పుడు కూడా బెత్తంతో కొట్టించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.