నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్‌

58చూసినవారు
నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్‌
ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు (ICC) అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయనతోపాటు మాజీ రక్షణశాఖ మంత్రి యోఆవ్‌ గల్లాంట్‌పైనా ఇవి జారీ అయ్యాయి. గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేక చర్యల ఆరోపణలపై ఈ ఇద్దరిపై ఐసీసీ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. కాగా, తనపై ఐసీసీ అరెస్టు వారెంటు జారీ చేయడాన్ని నెతన్యాహు ఖండించారు. అవి అసంబద్ధమైన, తప్పుడు చర్యలని, వాటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్