రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ’మాకు పురుగులు అన్నం పెట్టి, ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకుని తింటున్నారు. మేం అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండని అంటూ బూతులు తిడుతున్నారు. హాస్టల్ సిబ్బంది కంట్లో కారం కొట్టారు. భరోసా ఇవ్వాల్సిన ఉపాధ్యాయులే 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతారంటూ బెదిరిస్తున్నారు‘ అని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రావాలని నినాదాలు చేశారు.