ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లోని ఓ ప్రముఖ పాఠశాలలో జరిగిన ఫేర్‌వెల్ పార్టీలో విద్యార్థులు బీభత్సం సృష్టించారు. ప్రమాదకరమైన కారు విన్యాసాలు చేసి గాలిలోకి కాల్పులు జరిపారు. విద్యార్థుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఈ వీడియోలో సుమారు 70 మంది విద్యార్థులు కార్లతో స్టంట్స్ చేశారు. మరికొందరు గాలిలో తుపాకీతో కాల్పులు జరిపారు.