చలికాలంలో మార్నింగ్ వాక్ చేసేవారు గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. చలిలో శారీరక శ్రమ గుండెకు హానికరమేనని వైద్యులు చెబుతున్నారు. గుండె సమస్యలున్నవారు చలి కాలంలో తేలికపాటి వ్యాయామాలు ఎంచుకోవాలి. సాధారణ నడక, వ్యాయామాలు ఇంటి పరిసరాల్లోనే చేయడం మంచిది. ధ్యానం, ప్రాణాయామం వంటి వాటితో ప్రయోజనం ఉంటుందని తెలిపారు.