రోజూ 7-9 గంటల నిద్ర చాలు. దానికి మించి ఎక్కువ నిద్రపోతే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువ నిద్రించేవారిలో మెదడు పనితీరు మందగిస్తుంది. మతి మరుపు, ఏకాగ్రత వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల శరీర బరువు పెరగడం, గుండె జబ్బులకు అవకాశం కల్పిస్తుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర సమయాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ముఖ్యమని గుర్తించాలి.