చాలామంది అప్పుడప్పుడు అసిడిటీ సమస్యతో బాధపడుతుంటారు. మసాలాలు ఉన్న ఆహారం, వేళ తప్పించి భోజనం చేయడం, టీ, కాఫీలను తాగడం వల్ల అసిడిటీ వస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కలబంద రసం జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. కడుపులో మంటగా ఉన్నప్పుడు చల్లని పాలు, కొబ్బరినీళ్లను తాగితే మేలు జరుగుతుంది.