సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. దీంతో ప్రజలు గాలిపటాలు ఎగరవేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అయితే, విచిత్రంగా ఓ కోతి గాలిపటాన్ని ఎగరవేస్తూ కెమెరాకు చిక్కింది. కోతి మేడపై కూర్చుని సరదాగా గాలిపటాన్ని ఎగరవేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా.. కోతులు ఇలా క్కూడా చేస్తాయా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.