తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ముగిశాయి. గత ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుంచి 25 రోజుల పాటు జరిగిన అధ్యయనోత్సవాలు ఇవాళ్టితో ముగిశాయి. ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి దివ్య ప్రబంధ గోష్టి నిర్వహించారు.