రాఖీపండగ చరిత్రపై సుధామూర్తి వీడియో వైరల్

55చూసినవారు
రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంపీ సుధామూర్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. '16వ శతాబ్దంలో చితోడ్‌గఢ్‌ రాణి కర్ణావతి ప్రమాదంలో ఉన్నప్పుడు ఓ చిన్న దారాన్ని మొగల్‌ చక్రవర్తి హుమాయున్‌కు పంపించింది. తాను ప్రమాదంలో ఉన్నానని, తనను ఓ చెల్లిగా భావించి రక్షించాలని కోరింది. అయితే హుమాయున్‌ వెళ్ళేసరికి ఆమె మరణించింది. అప్పటి నుంచి ఈ రాఖీ సంప్రదాయం ప్రారంభమైందని' సుధామూర్తి ఆ వీడియోలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్