విజయనగరం జిల్లాలోని జీఎంఆర్ కేర్ ఆసుపత్రి వైద్యులు వృద్ధురాలికి మత్తు మందు ఇవ్వకుండానే మెదడుకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. పక్షవాతం లక్షణాలతో బాధపడుతున్న 65ఏళ్ల మహిళను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఆమె మెదడులో రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించి, శస్త్రచికిత్స చేయాలని తెలిపారు. ఆమెకు అనస్తీషియా ఇవ్వడం ప్రమాదకరమని గుర్తించారు. అయితే ఈనెల 4న బాధితురాలికి బాలసుబ్రహ్మణ్యం పాటలు వినిపిస్తూ వైద్యులు శస్త్రచికిత్స చేశారు.