వేసవి దుక్కులు రైతుకు ఎంతో మేలు

83చూసినవారు
వేసవి దుక్కులు రైతుకు ఎంతో మేలు
వేసవిలో లోతు దుక్కులు దున్నడంతో రైతులకు బోలెడు లాభాలు ఉన్నాయి. లోతు దక్కులతో భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. వర్షాలకు ముందు భూమిని దున్నడం వల్ల తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. దీంతో భూమిలో తేమశాతం పెరిగి భూసారం పెరుగుతుంది. పురుగులు, తెగుళ్ల యాజమాన్యం, కలుపు మొక్కల పెరుగుదల తగ్గుతుంది. ఈ దుక్కులు దున్నే ముందు పశువుల ఎరువు వేసుకోవాలి.

ట్యాగ్స్ :