భారత సైన్యం మానవత్వం చాటుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని కుప్వాడా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి మారుమూల పల్లెకు చెందిన ఓ గర్భిణి ఆరోగ్యం విషమించింది. స్థానికంగా వైద్యులు అందుబాటులో లేని దుస్థితి. ఈ విషయం తెలుసుకున్న గుగల్ధార్ బెటాలియన్ వెంటనే స్పందించింది. పీకే గలిలోకి బెటాలియన్ వైద్యాధికారి తొలుత ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం స్ట్రెచర్‌పై గ్రామస్థుల సాయంతో కాలినడకన ఇతర ప్రాంతానికి సురక్షితంగా తరలించారు.