ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్

82చూసినవారు
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్
తన ప్రాణాలను యాపిల్ వాచ్ కాపాడిందంటూ పాలసీ రీసెర్చర్ స్నేహ సిన్హా(ఢిల్లీ) వెల్లడించారు. 'నాకు ఆరోగ్య సమస్యలు లేవు. ఇటీవల వర్క్ ముగించుకుని ఇంటికి వచ్చాక గుండెలో దడగా అనిపించింది. అసాధారణ హార్ట్ బీట్ ఉందంటూ యాపిల్ వాచ్ హెచ్చరించింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నా' అంటూ యాపిల్ CEO టిమ్ కుక్కు ఆమె ఈమెయిల్ చేశారు. సరైన టైమ్కు వైద్యం అందినందుకు సంతోషంగా ఉందని ఆయన రిప్లై ఇచ్చారు.

సంబంధిత పోస్ట్