తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి సుప్రభాత సేవ పునఃప్రారంభం కానున్నట్లు టీటీడీ తెలిపింది. మంగళవారంతో ధనుర్మాస ఉత్సవాలు ముగియడంతో బుధవారం నుంచి సుప్రభాత సేవతో శ్రీవారికి మేల్కొలుపు జరగనుంది. ఆలయంలో ప్రతిరోజూ జరిగే ఆర్జిత సేవల్లో ‘సుప్రభాతం’ ఒకటి. ఈ సేవతోనే పూజా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. సేవలో భాగంగా శ్రీవారి బంగారు వాకిలి తలుపులు తెరుచుకోనున్నాయి. మార్గశిర మాసంలో మినహాయించి ప్రతిరోజూ ఈ సేవను టీటీడీ నిర్వహిస్తుంది.