తనపై దాడి చేసిన మొసళ్లను ఎదురించి ఓ జీబ్రా ధైర్యంగా తప్పించుకుంది. ఈ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఓ నదిలో కొన్ని మొసళ్లు ఓ జీబ్రాపై దాడి చేశాయి. జీబ్రాను ఎలాగైనా లొంగదీసుకోవాలని విశ్వప్రయత్నం చేశాయి. అయితే, వాటి ప్రయత్నాలకు చెక్ పెట్టిన జీబ్రా తిరిగి వాటిపైనే దాడి చేసింది. ఓ మొసలిని తన నోటితో పట్టుకుంది. చివరికి మొసళ్లు దానిని వదిలిపెట్టడంతో బతుకుజీవుడా అంటూ జీబ్రా బయటపడింది.