వడదెబ్బతో గ్రామపంచాయతీ ఉద్యోగి మృతి

5543చూసినవారు
వడదెబ్బతో గ్రామపంచాయతీ ఉద్యోగి మృతి
గ్రామపంచాయతీ ఉద్యోగి వడదెబ్బతో మృతి చెందిన ఘటన శనివారం యాదాద్రి జిల్లాలో జరిగింది. గ్రామస్థుల వివరాలిలా. భువనగిరి మండలం జమ్మాపురానికి చెందిన మాదాను కస్పరాజు శనివారం గ్రామంలో నీరు సరఫరా చేస్తుండగా వడదెబ్బతో స్పృహ తప్పి పడిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.