భువనగిరి: ఆర్టీసీ బస్సులో గుండెపోటు.. ప్రయాణికుడు మృతి

54చూసినవారు
ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందారు. ప్రయాణికుల ప్రకారం.. బస్సులో ఉన్న పాండు అనే వ్యక్తికి గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన కండక్టర్, ఇతర ప్రయాణికులు అతనికి సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో 108లో ఘట్కేసర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడిని భువనగిరికి చెందిన గీత కార్మికుడిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్