వాగులో మొసలి ప్రత్యక్షం
చిలుకూరు మండలం పోలేనిగూడెం ఎస్కేప్ నుంచి బోతవేలు చెరువు కొచ్చే చెరువులో మొసలి ఉందని తహశీల్దారు ధ్రువ కుమార్ తెలిపారు. రైతులెవ్వరు ఆ వాగులోకి దిగవద్దని చెప్పారు. ఆ వాగు పక్కన పొలాలు ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పారు. మొసలి సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులకు తెలుపమన్నారు.